మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం

కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మంగళవారం ఎల్లారెడ్డి మండలం ఆల్మాజిపూర్ గ్రామంలోని తన బంధువు సుభాష్ రెడ్డి ఇంట్లో పోచమ్మ పండుగ విందులో పాల్గొన్నారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి ఆయన ఎల్లారెడ్డి మండలానికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆదిమూలం సతీష్ కుమార్, జలంధర్ రెడ్డి, ఏగుల నర్సింహులు, బుజ్జన్నగారి గంగారెడ్డి, కృష్ణారెడ్డిలు జీవన్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్