కులమతాల మధ్య చిచ్చుపెట్టేవారికి ఎన్నికల్లో బుద్ది చెప్పండి

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, రెచ్చగొట్టే మాటలతో కులమతాల మధ్య చిచ్చుపెట్టేవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గురువారం 3, 4, 5, 8, 26, 29, 30, 31 వార్డులలో ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కామారెడ్డి అభివృద్ధికి బంగారు బాటలు వేయాలని ప్రజలకు సూచించారు. మహిళలు, యువత ఆయనకు ఘనస్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్