గోపాల్పేట్ ను జిల్లాలోని ఉత్తమ జీపీగా నిలుపుతాం

ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్ మేజర్ గ్రామ పంచాయితీని కామారెడ్డి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయితీగా నిలిపేందుకు కృషి చేస్తానని సర్పంచ్ వంశీ అన్నారు. గురువారం ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో పాలక వర్గంతో కలిసి అభివృద్ధి పనులు చేపడతామని, అన్ని వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని, ముఖ్యంగా తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని, ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్