ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే యువతి అత్తింటి వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. లక్ష్మీ భర్త గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన పేరుపై వచ్చిన బీమా డబ్బుల కోసం అత్తింటి వారు ఆమెను వేధించినట్లు ఎస్సై వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్