కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ప్రధాన రహదారిలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన మహిళను గమనించిన స్థానికులు, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ లో మహిళను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ సదాశివ నగర్ మండలం ఉత్తనూర్ గ్రామానికి చెందిన మహిళగా మాజీ ఉప సర్పంచ్ వంకాయల రవి గుర్తించారు.