ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కౌసర్ ఉన్నిసా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీరామ్ సేన యువ దుర్గామాతలకు షెడ్డు నిర్మాణానికి బుధవారం రూ. 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కమిటీ అధ్యక్షుడు సురేష్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తులసి, వినోద్, కిరణ్, కిట్టు, సాయి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.