ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో మేస్త్రి సంఘానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఎల్లారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.