ప్లాస్టిక్ పై సమరం ప్రకటించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుభకార్యక్రమాల్లో ప్లాస్టిక్ బదులు స్టీల్ లేదా పేపర్ వాడాలని, గ్రామాల్లోకి ఐస్ క్రీమ్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.3000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత పోస్ట్