ఎల్లారెడ్డి ప్రజావాణి: 3 ఫిర్యాదులపై ఆర్డీఓ స్పందన

ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో నీటిపారుదల, సివిల్ సప్లైస్, మున్సిపల్ శాఖలకు సంబంధించి మూడు దరఖాస్తులు అందినట్లు ఆర్డీఓ రొడ్డ ప్రభాకర్ తెలిపారు. ఈ దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕