ఎల్లారెడ్డి మండల కేంద్రంలో వంట కార్మికులు బుధవారం తహసిల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. 22 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు సోఫియా, హేమలత, సంగీత మొదలైన వారు సొంత డబ్బులతో వంట పాత్రలు, సరుకులు కొనుగోలు చేసి పని చేస్తున్నామన్నారు. చిన్నారిని పనుల్లోంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వంట కార్మికుల సమస్యలపై న్యాయం చేయాలని కోరారు.