ఎల్లారెడ్డి పట్టణంలోని త్రీ శక్తి సర్వమంగళ దత్త పీఠంలో కొలువై ఉన్న శ్రీ భగలాముఖి పీఠం యొక్క నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఆవిష్కరించారు. దత్తపీఠం జ్యోతిష్య పండితులు శ్రీ క్రాంతి పటేల్ ఈ విషయాన్ని తెలిపారు. గత ఐదేళ్లుగా, దత్త పీఠానికి మరియు అమ్మవారి సేవలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్లను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.