ఆన్లైన్ బెట్టింగ్తో ఉరేసుకొని యువకుని అత్మహత్య

కామారెడ్డి పట్టణంలో ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసై అప్పులపాలైన శ్రీకర్ (30) జనవరి 1వ తేదీన ఇంట్లోని గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీకర్, ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్ గేమింగ్ ఆడుతూ అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మి, తండ్రి కొంత బాకీలు చెల్లించినా ఇంకా అప్పులు మిగిలి ఉండటంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్