కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. మోదీ వ్యాఖ్యలు సత్యదూరం: ఎంపీ చామల

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ వాస్తవాలకు దూరంగా మాట్లాడారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న పథకాలు తెలుసుకొని మోదీ మాట్లాడాలి. సన్న బియ్యం, భూభారతి లాంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. బీసీ ప్రధాని అంటారు కదా.. మరి బీసీ కులగణన మీద మోదీ ఎందుకు మాట్లాడటం లేదు" అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్