బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆమె, ఆయన ప్రవర్తనలో అసహనం కనిపిస్తోందని విమర్శించారు. బీజేపీపై రాహుల్ చేసిన కులతత్వం, పురుషాధిపత్య ఆరోపణలను ఖండించిన కంగనా, "బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతోంది. ఈ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీదే మహిళా వ్యతిరేక దృక్పథం" అని కౌంటర్ ఇచ్చారు.