ఓటీటీలోకి ‘కాంతార చాప్టర్‌ 1’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 31వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అధికారికంగా సోమవారం ప్రకటించింది. ఈ నెల 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ అత్యధిక వసూలు చేసిన భారతీయ సినిమాల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్