కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయాన్ని నటుడు రణ్‌వీర్ సింగ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘కాంతార’ సినిమాలోని ‘పంజుర్లి’ హావభావాలను ఓ కార్యక్రమంలో ప్రదర్శించడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు సూచనల మేరకు రణ్‌వీర్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.