హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ‘హొంబలే ఫిల్మ్స్’ నిర్మించిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి రిషబ్ ముందుగా రూ.4 కోట్లే ఛార్జ్ చేశాడని తెలిసింది. అయితే ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉన్నందున ఈసారి ఆయన పారితోషికం రూ.100 కోట్లవరకు పెరిగిందని టాక్. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతుంది.