TG : కరీంనగర్ సీపీ గౌస్ ఆలం చేతగానితనంతో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని, ఐదు రోజులైనా PMJ జ్యూవెలరీలో దోపిడీ చేసిన దొంగలను పట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అల్గునూరులో ఓ లాయర్‌ను ఉత్తరప్రదేశ్ ముఠా ఆయుధాలతో బెదిరించి, హత్యాయత్నం చేసినా సీపీ స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనలపై సీపీ గౌస్ ఆలంను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.