ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (IAPT) జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'నేషనల్ కాంపిటీషన్ ఆన్ ఎస్సే రైటింగ్ ఇన్ ఫిజిక్స్' (NCEWP) పోటీల్లో స్థానిక కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన ఆండ్రియ మదన్ జోస్, 8వ తరగతి, జాతీయ స్థాయిలో ద్వితీయ (2వ) బహుమతి సాధించి అద్భుత ప్రతిభ కనబరిచిందని మాట్లాడారు.
ఈ కఠినమైన పోటీలో విద్యార్థుల విభాగంలో ఆండ్రియ అద్భుతమైన ప్రదర్శనతో జాతీయ స్థాయిలో రెండో స్థానం తో రన్నరప్‌గా నిలిచినదని, ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలలో రెండో స్థానాన్ని గెలుచుకోవడం చాలా గొప్ప విషయమని మరియు స్ఫూర్తి దాయకమని వారు చెప్పారు.
కాగా ఈ పోటీకి సంబంధించిన నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అక్టోబర్ 2 నుండి 6వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగుతున్న ఐఏపీటీ జాతీయ మహాసభల (IAPT National Convention) వేదికగా విజేతకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విజేతకు పుష్పగుచ్చాన్ని అందజేసి భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన విజయాలను నమోదు చేయాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.