డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులలోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చు. వాటిలో పాల్గొనేందుకు ప్రోత్సహించడం వల్ల వారు పలు విషయాలపై పట్టు సాధించి, సమాజంలో ఉత్తమమైన స్థానాన్ని పొందగలుగుతారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలను విద్యార్థులు సమగ్రంగా విశ్లేషించి, వాటిపై పూర్తి పట్టు సాధించే దిశగా కృషి చేయాలి" అని అన్నారు.
ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పిస్తూ, వారిని వాటిలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాయని తద్వారా వారు ఘన విజయాలను నమోదు చేస్తున్నారని డా. నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఒలింపియాడ్‌లలో ప్రతిభ చూపిన విద్యార్థులు:
రసజ్ఞ (9వ తరగతి) – ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం.
హేమంత్ జాదవ్ (10వ తరగతి) – కంప్యూటర్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం.
ఎ. శ్రీయాన్ రెడ్డి (4వ తరగతి), యు. సాత్రివ్ (6వ తరగతి), ఇ. లిఖిత్ కుమార్ (8వ తరగతి), పి. నమన్విత (10వ తరగతి) – హిందీ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు.
హవీష్ రెడ్డి (6వ తరగతి), యం. శివేన్ రెడ్డి (8వ తరగతి) – సోషల్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు.
ఎ. యశ్ చంద్ర (9వ తరగతి) – సోషల్ ఒలింపియాడ్‌లో స్టేట్ టాపర్.
బి. తనమయి (7వ తరగతి) – నేషనల్ ఎస్సే ఒలింపియాడ్‌లో స్టేట్ ర్యాంక్.
ముగ్గా హాసిని (10వ తరగతి) – ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలింపియాడ్‌లో స్టేట్ ర్యాంక్.
ఎ. శ్రీయాన్ రెడ్డి (4వ తరగతి) – సోషల్ ఒలింపియాడ్‌లో స్టేట్ ర్యాంక్ సాధించి పాఠశాలకు కీర్తి తెచ్చారు.
ఈ అభినందన సభలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.