తాటికల్లును మానవులే కాదు మేము సైతం తాగుతామంటూ ఓ వానరం ముందుకొచ్చింది. మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతాన బుధవారం ఓ వానరం తాటికల్లు తాగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. పక్కన కూర్చున్న వ్యక్తితో సమానంగా ఆ వానరం గ్లాస్తో కల్లు తాగుతూ దర్జాగా కూర్చుంది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి సంబరపడ్డారు.