వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపిన వివరాల ప్రకారం, బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన గండి శ్రీధర్, అదే గ్రామానికి చెందిన సావనపెల్లి శశి ప్రీతమ్ పై 07.01.2026న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు గాయపడ్డాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుడు గండి శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈరోజు రిమాండ్‌కు తరలించారు.