కరీంనగర్ జిల్లాలోని వివిధ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో ఉంటున్న 148 మంది పిల్లలకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ కార్డులను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అందజేశారు. ఈ కార్డుల ద్వారా పిల్లలు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డిఎంహెచ్ఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.