చొప్పదండి: సహకార సంఘాల పై అవగాహన కార్యక్రమం

జాతీయ సహకార వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రైతులకు, విద్యార్థులకు సహకార సంఘాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులందరూ కలిసి సమైక్యంగా పనులు చేసుకోవడానికి సహకార సంఘాలు దోహదపడతాయని ఆయన విద్యార్థులకు వివరించారు. చొప్పదండి సహకార సంఘం నాలుగుసార్లు జాతీయస్థాయిలో ఉత్తమ సహకార సంఘంగా అవార్డు పొందిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్