కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం అర్నకొండ సింగిల్ విండో చైర్మన్ గా కాంగ్రెస్ నాయకుడు ఎన్నం మనోహర్ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బలహీన వర్గాలకు చెందిన మనోహర్ కు ఈ అవకాశం దక్కింది. ఆర్నకొండ సింగిల్ విండో పరిధిలో మంగళపల్లి, చిట్యాలపల్లి, రేవల్లి తదితర గ్రామాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ను పలువురు అభినందించారు.