చొప్పదండి: నవోదయలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువు పెంపు

కరీంనగర్ జిల్లా, చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి గురువారం తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి ఈ ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికోసం 2027 ఏప్రిల్ 10న లాటరల్ ఎంట్రీ ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 8, 10 తరగతులు చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕