చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసరాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగించిన రు. 4650 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేస్ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ చట్టవిరుద్ధమైన పేకాట జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.