మహబూబ్ నగర్ త్రిబుల్ ఐటీలో సీటు సాధించిన చొప్పదండి జడ్పిహెచ్ఎస్ (బాలురు) విద్యార్థి దీకొండ యశ్వంత్ ను శుక్రవారం పలువురు అభినందించారు. చొప్పదండి మండలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి సీటు సాధించిన ఏకైక విద్యార్థి యశ్వంత్ అని హెచ్ఎం రాజిరెడ్డి ప్రశంసించారు. తమ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి సీటు సాధించిన యశ్వంతును పాఠశాల ఉపాధ్యాయులు కూడా అభినందించారు.