చొప్పదండి: గురుకుల విద్యార్థినిలకు వైద్య పరీక్షలు

చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ కీర్తన విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. వాతావరణ పరిస్థితులలో మార్పుల దృష్ట్యా శుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ ఎల్ స్వాతి, ఆసుపత్రి సూపర్వైజర్ జి శ్రీదేవి, ఏఎన్ఎం నల్లల పుష్పలత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్