చొప్పదండి: నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు ఇవ్వాలి

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కొండయ్యపల్లె గ్రామంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి వారికి పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కొండయ్యపల్లెలో బాధిత కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండయ్యపల్లెలో అనేక దళిత కుటుంబాలు సుమారు 60 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాయని తెలిపారు. తాతలు, తండ్రుల కాలం నుంచి అక్కడే ఉంటూ, కొందరు సొంతంగా భూములు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕