చొప్పదండి: కాంగ్రెస్ కార్యాలయంలో వైయస్సార్ 17వ వర్ధంతి వేడుకలు

కరీంనగర్ జిల్లా, చొప్పదండి కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్ సేవలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో చరిత్ర సృష్టించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్