కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆదివారం భారత్ మినీ డోర్ ఆటో యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పాలూరి ప్రసాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేగుల సంతోష్ ఉపాధ్యక్షుడిగా, లంక రవి కోశాధికారిగా, పోలం రమేష్ ప్రధాన కార్యదర్శిగా, యామ తిరుపతి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.