బోయినపల్లి: 'గొర్రెల చోరీ నిందితులను పట్టుకోవాలి'

బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన గొర్రెల చోరీపై జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించి, పోలీసులు వెంటనే నిందితులను పట్టుకోవాలని కోరారు. పెంజర్ల తిరుపతికి చెందిన 21, మల్యాల బాలయ్యకు 10, ఎల్లయ్యకు 7 గొర్రెలు దొంగల చేతిలో పోయాయి.

సంబంధిత పోస్ట్