చొప్పదండి మండలం ఆర్నకొండ నోముల రాజయ్య పల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు తగిన పౌష్టికాహారం తీసుకోవాలని వక్తలు సూచించారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని తెలిపారు. శిశువులకు ఆరు నెలలు నిండిన తర్వాత బాలామృతం అందించి, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వసంత, అంగన్వాడి టీచర్ సరోజ పాల్గొన్నారు.