కుళ్లిన గుడ్లతో కేకులు.. బేకరీ సీజ్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలోని 'గణేశ్ బెంగళూరు బేకరీ'పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పురుగులు పట్టిన మైదా, క్రీమ్, 420 కుళ్లిన గుడ్లను గుర్తించి అధికారులు షాక్కు గురయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన రూ. 9 వేల విలువైన ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు బేకరీ లైసెన్స్ను రద్దు చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్