కరీంనగర్ జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చొప్పదండి పట్టణ హనుమాన్ సాయి భజనమండలి, సేవా సమితి బృందం పాల్గొంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో వారు ఆలపించిన హరినామ సంకీర్తనలు, భజనలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భజన మండలి ప్రధాన సభ్యులైన పిట్టల రఘు, దండె లింగన్న, లావణ్య, దూస రాము, లాపణ్య దంపతులను ఆహ్వాన కమిటీ గురువారం ఘనంగా సత్కరించింది.