రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై బీజేపీ బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రైల్వే నుండి స్ట్రక్చరల్ డిజైన్ డ్రాయింగ్స్ పూర్తి కాకపోవడానికి బీజేపీ నాయకులే కారణమని ఆరోపించారు. భూసేకరణ వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.