జూలై 10న గంగాధర మండలంలోని క్రాసింగ్ వద్ద చర్చిలో మధ్యాహ్నం 12:30 గంటలకు చొప్పదండి నియోజకవర్గ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. పాస్టర్ పర్లపెల్లి ఏలియా అధ్యక్షునిగా, జి. జాన్ ఉపాధ్యక్షునిగా, సామ వినయ్ సాగర్ ప్రధాన కార్యదర్శిగా, బి. అశోక్ సంయుక్త కార్యదర్శిగా, టీ. టైటస్ కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు.