కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆదివారం అన్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా -సబ్బండ వర్గాలకు ప్రజా ప్రభుత్వం అండ కార్యక్రమంలో భాగంగా కోనేరుపల్లెలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. రూ. 10 లక్షల ఎమ్మెల్యే నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.