చొప్పదండి: గోపాల్ రావు పేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ తొలి ఉద్యమ ధృవతార మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ప్రకటించాలి అని రామడుగు మండలం గోపాలరావుపేట పద్మశాలి సంఘం అధ్యక్షులు కొలిపాక మల్లయ్య, జాతీయ యువజన అవార్డు గ్రహీత, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అలువాల విష్ణు లు అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం గోపాల్ రావు పేట ఆధ్వర్యంలో ఆదివారం సంఘం భవనం లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕