చొప్పదండి: ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు

చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ నిమ్మల సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్ల కోసం అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం పాఠశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.

సంబంధిత పోస్ట్