చొప్పదండి: రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలిచ్చాం: సీఎం రేవంత్

రాష్ట్రంలో మరో 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చొప్పదండిలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులను వివరిస్తే బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోతాయని అన్నారు. 70 వేల ఉద్యోగాలు, 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపి కేసీఆర్‌ను అరెస్ట్ చేయించాలని బండి సంజయ్ కి సీఎం రేవంత్ సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్