చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, కురిక్యాల, గట్టుబూత్కూరు గ్రామాల్లో రూ. 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఒడ్యారం మాజీ సర్పంచ్ సంపత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలకు టీవీ, బీరువా తదితర వస్తువులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.