చొప్పదండి: దొంగతనం కేసులో యువకుడి అరెస్ట్

చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన కొలిపాక మధుకుమార్ అనే యువకున్ని దొంగతనం కేసులో శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటైన మధు కుమార్ ఇటీవల రాగంపేటలోని కొమురయ్య ఇంటిలో ప్రవేశించి తుల బంగారం, 22000 నగదు దొంగిలించాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ రెడ్డి, ఏఎస్ఐ సమ్మయ్య తదితరులను సిఐ ప్రదీప్ కుమార్ అభినందించారు.

సంబంధిత పోస్ట్