భారీ వర్షానికి పిడుగుపాటుతో ఆవు మృతి, లక్షల్లో నష్టం

చొప్పదండి మండలం రాగంపేటలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కనకయ్య అనే రైతుకు చెందిన ఆవు పిడుగుపాటుతో మృతి చెందింది. సుమారు లక్ష రూపాయలు విలువైన ఆవు, రెండు రోజుల్లో పురుడు పోసుకోవాల్సి ఉందని, ఈ దుర్ఘటనతో రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕