కరీంనగర్ జిల్లా చొప్పదండి సింగిల్ విండో వద్ద బుధవారం జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ పథకం కింద హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏడిఏ ప్రియదర్శిని ప్రారంభించారు. మండలానికి కేటాయించిన 119 బ్యాగుల విత్తనాలను, ఒక్కోటి నాలుగు కిలోల చొప్పున రైతులకు పంపిణీ చేశారు. ఈ విత్తనాలు రాయితీపై లభించడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ అంజిత్ కుమార్, సీఈఓ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.