చొప్పదండి: పశువులకు సమర్థవంతమైన వైద్యసేవలు అందించాలి

పశువులకు వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలని జిల్లా పశువైద్య & పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. విలాసాగర్, బోయినపల్లి, వేములవాడ సబ్ సెంటర్స్ కోరం, నూకలమర్రి, సాత్రాజుపల్లిల్లోని పశువైద్య శాలలను ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. సమయపాలన పాటించాలని వారికి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్