కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం వెదురుగట్టలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు వరిలో సన్న రకాల నమోదు, ఎరువుల యాప్, డిజిటల్ పంట సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. ఏవో మమత మాట్లాడుతూ, సొంత విత్తనాలు వాడే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం నింపి ఏఈఓలకు అందించాలని సూచించారు. గతంలో ప్రైవేటు డీలర్ల వద్ద నమోదు చేసుకున్నవారు మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎం. సమత, ఏఈఓ సంపత్, రైతులు పాల్గొన్నారు.