బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ దత్త సాయి ఆలయంలో ఉదయం నుండి బాబాకు అభిషేకాలు, హారతి, పల్లకి సేవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాబా ఆశీస్సులు తీసుకున్నారు.