చొప్పదండిలో ఘనంగా అంతర్జాతీయ ఫార్మాసిస్ట్ దినోత్సవం

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో శుక్రవారం అంతర్జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్యాక్స్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జన్ ఔషధి కేంద్రం ఫార్మసిస్టులు నాంపల్లి మమత, కస్తూరి కావ్య, అసిస్టెంట్ కళ్ళెం హర్షవర్ధన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వారి సేవలు కీలకమని కొనియాడారు. జన్ ఔషధి కేంద్రంలో 80% రాయితీతో నాణ్యమైన మందులు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిజానపురం చందు, సి ఈ ఓ కళ్లెం తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕